Prithviraj: సలార్ 2.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్!
సమ్మర్ కానుకగా మే 9న ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడి' ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్దమవుతోంది. అయితే.. తాజాగా వరదరాజ మన్నార్ ఇచ్చిన సలార్ 2 అప్డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది.
Prithviraj: ప్రజెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కల్కి రిలీజ్ కోసమే కాదు.. సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా? అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 22న వచ్చిన సలార్ పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రభాస్ మాసివ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ కటౌట్ చూసి పండగా చేసుకున్నారు రెబల్స్. ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌కు ఎగిరి గంతేశారు. దీంతో సలార్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్ ఒకటి వైరల్‌గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ అండ్ విలన్‌గా నటించిన మళయాళ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్.. తన గోట్ లైఫ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. సలార్ 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ‘నేను ప్రభాస్ మంచి స్నేహితులం. ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్‌లో ఉంటాం.
సలార్ 2 షూటింగ్ అతి త్వరలోనే ప్రారభం కానుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవల నటుడు బాబీసింహా కూడా.. సలార్ పార్ట్2 కథ సిద్ధంగా ఉందని.. ఏప్రిల్‌లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని.. వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు ప్లాన్ చేసినట్లుగా తెలిపాడు. దీంతో వచ్చే నెలలో సలార్ సెట్స్ పైకి వెళ్లడం పక్కా అంటున్నారు. ఇక సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ టైటిల్‌తో తెరకెక్కగా.. పార్ట్ 2ని ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రూపొందించనున్నారు. అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్‌లోనే ఉంటుందని పార్ట్ 1తో చెప్పెశాడు ప్రశాంత్ నీల్. అందుకే.. ఈ సీక్వెల్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి శౌర్యాంగ పర్వం అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు బయటికి వస్తుందో చూడాలి.