Samantha : స్టార్ బ్యూటీ సమంత చివరగా 'యశోద' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది.. దాంతో నెక్స్ట్ ఫిల్మ్ శాకుంతలం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు. గుణ శేఖర్ ఇంకా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా చెక్కుతునే ఉన్నాడు. అందుకే థియేటర్లోకి రావడానికి కాస్త సమయం పడుతోంది. అయితే ఫైనల్‌గా ఫిబ్రవరి 17న శాకుంతలం రావడం ఖాయమని ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎప్పటిలానే మరోసారి వాయిదా అంటూ సమంతను సైడ్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.. మళ్లీ పోస్ట్ పోన్ చేశారు.
స్టార్ బ్యూటీ సమంత చివరగా ‘యశోద’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది.. దాంతో నెక్స్ట్ ఫిల్మ్ శాకుంతలం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కానీ సినిమా మాత్రం రిలీజ్ అవడం లేదు. గుణ శేఖర్ ఇంకా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా చెక్కుతునే ఉన్నాడు. అందుకే థియేటర్లోకి రావడానికి కాస్త సమయం పడుతోంది. అయితే ఫైనల్‌గా ఫిబ్రవరి 17న శాకుంతలం రావడం ఖాయమని ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఎప్పటిలానే మరోసారి వాయిదా అంటూ సమంతను సైడ్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.. మళ్లీ పోస్ట్ పోన్ చేశారు. అన్నట్టే ఇప్పుడు శాకుంతలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ముందుగా వినిపించినట్టుగానే ఏప్రిల్ 14న థియేటర్లోకి రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ లెక్కన సమంత మరో రెండు నెలలు వెనక్కి వెళ్లినట్టే. ఇక సమంత లీడ్ రోల్ పోషించిన ఈ మైథలాజికల్ మూవీలో.. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ‘శాకుంతలం’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించంది. అలాగే దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు నటిస్తున్నాడు. మరి ఈసారైనా శాకుంతలం అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందేమో చూడాలి.