ప్రస్తుతం స్టార్ హీరోయిన్ సమంత అన్ని భాషల సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో యశోద, ఖుషి, శాకుంతలం సినిమాలు చేస్తోంది. వీటిలో యశోద, శాకుంతలం రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఇటీవలె యశోద టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు శాకుంతలం రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ‘రుద్రమదేవి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇదే. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో.. దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ మైథలాజికల్ డ్రామాని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేర్ కుమార్తె నీలిమ గుణ, బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. గత కొంత కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే గత కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతు వస్తోంది ఈ చిత్రం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు. నవంబర్ 4న శాకుంతలం మూవీని గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు ఓ సాలిడ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శాకుంతలంగా సమంత లుక్ అదిరిపోయేలా ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్లో గుణశేఖర్ స్టైల్లోనే భారీ సెట్స్ కనిపిస్తున్నాయి. దాంతో శాకుంతలం విజువల్ గ్రాండియర్ రాబోతోందని చెప్పొచ్చు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో గుణశేఖర్-సమంత ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.