ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. అమ్మాయి, అబ్బాయిని మోసం చేస్తే చాలు.. సినిమా హిట్ అని చెప్పడానికి ఆర్ ఎక్స్ 100 బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కావాలంటున్నారు. తాజాగా దీనిపై హీరో కార్తికేయ క్లారిటీ ఇచ్చేశాడు.
RX 100 sequel: ఆర్ ఎక్స్ 100 మూవీ ఎంత సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోగా కార్తికేయ, హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. యూత్‌కి ఆ సినిమా తెగ కనెక్ట్ అయిపోయింది. ఆ తరువాత ఈ ముగ్గురు చేసిన సినిమాలు ఏ మాత్రం ఆకట్టులేకపోయాయి. ముఖ్యంగా కార్తికేయ ఎన్ని సినిమాలు చేసినా.. ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ పడడం లేదు. ఆ మధ్యలో అజిత్ సినిమాలో విలన్‌గా కూడా నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ‘బెదురులంక 2012’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై కార్తికేయ భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ప్రస్తుతం బెదురులంక ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ ఉంటుందా? అని అడిగితే.. ఆర్ఎక్స్ 100 సీక్వెల్ అని కాదు, అజయ్ భూపతితో కలిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. దానికి సరైన కథ కుదరాలి, కొన్ని పాయింట్స్ అనుకుంటున్నాం.. అన్నీ కుదిరినప్పుడు ఆ సినిమా అనౌన్స్ చేస్తామని అన్నాడు. అంటే ఆర్ ఎక్స్ 100 కాంబో మరో అదిరిపోయే కంటెంట్‌తో రావడం పక్కా అని చెప్పొచ్చు. ప్రస్తుతం అజయ్ భూపతి ‘మంగళ వారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో నటిస్తోంది. అజయ్‌తోపాటు పాయల్ ఆశలన్నీ మంగళవారం పైనే ఉన్నాయి. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే.. ఆర్ ఎక్స్ 100 కాంబో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఈసారి కార్తికేయ, అజయ్ కలిసి ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తారో చూడాలి.