టాలీవుడ్(Tollywood) టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ramcharan) నటించిన సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR). ఈ మూవీని దర్శకుడు రాజమౌళి(Director Rajamouli) అద్భుతంగా తెరకెక్కించారు. ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఆస్కార్ బరిలో నిలిచి ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట(Natu Natu song)కు ఆస్కార్ ను కైవశం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎత్తర జెండా పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించింది.
తాజాగా ‘ఎత్తర జెండా’ పాటలో సైడ్ డ్యాన్సర్ గా పనిచేసిన మణికంఠన్ (Side Dancer Manikantan)ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మణికంఠన్ ను అదుపులోకి తీసుకున్నారు. జంజారా హిల్స్ లోని రాఘవ రెసిడెన్సీలో నలుగురు డ్యాన్సర్లలో మణికంఠన్ మందు తాగాడు. ఆ తర్వాత మద్యం మత్తులో గొడవ చేస్తుండగా అక్కడున్న వాచ్మెన్ వారిని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. కారిడార్ లో గొడవ చేయొద్దని తెలిపాడు.
వాచ్మెన్ మాటలను పట్టించుకోని మణికంఠన్(Side Dancer Manikantan) గొడవను ఇంకాస్త పెద్దది చేశాడు. వాచ్ మెన్ ను మూడో అంతస్తు నుంచి తోసివేయడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వాచ్మెన్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. స్థానికుల వివరాల మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మణికంఠన్ ను అరెస్ట్ చేశారు. మణికంఠన్‌ది తమిళ సినీ ఇండస్ట్రీ అయినా ప్రస్తుతం టాలీవుడ్లో సెటిల్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో సైడ్ డ్యాన్సర్ గా చేసిన మణికంఠన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.