బాలీవుడ్ నటి, హీరోయిన్ జియాఖాన్(Jiah khan) ఆత్మహత్య కేసు గురించి దాదాపు 10 ఏళ్ల తర్వాత కీలక అప్ డేట్ వచ్చింది. ముంబై(mumbai)లోని ప్రత్యేక సీబీఐ కోర్టు(cbi court) ఈరోజు (ఏప్రిల్ 28న) ఆమె ప్రియుడు, సినీ నటుడు సూరజ్ పంచోలీ(suraj pancholi)ని బెదిరింపు ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. జియా ఖాన్(25) జూన్ 3, 2013న ముంబైలోని తన జుహూ ఇంట్లో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది.
అంతేకాదు ఆమె రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా సూరజ్ పంచోలీని పోలీసులు(police) అరెస్టు చేశారు. ఆత్మహత్యకు సంబంధించి అతని ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ అతనిపై కేసు నమోదు చేశారు. మరోవైపు జియా హత్యకు గురైందని ఆమె తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. మరోవైపు సాక్ష్యాధారాల కొరత కారణంగా సూరజ్ పంచోలీ నిర్దోషి అని తాజాగా ప్రకటించడం సంచలనంగా మారింది.
ఇది కూడా చూడండి: Chrisann Pereira: జైల్లో నరకం అనుభవించా: ప్రముఖ నటి
నటుడు ఆదిత్య పంచోలి, జరీనా వహాబ్ల కుమారుడు సూరజ్ పంచోలి(suraj pancholi) దోషిగా తేలితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తీర్పు కోసం అతని తల్లి అతనితో పాటు కోర్టుకు వెళ్లింది. Mr Pacnholi జూన్ 2013లో ఈ కేసులో అరెస్టయ్యాడు. ఆ తర్వాత జూలై 2013లో బెయిల్పై విడుదలయ్యాడు.
ఈ కేసులో కీలక ప్రాసిక్యూషన్ సాక్షి, జియా తల్లి రబియా ఖాన్, ఇది ఆత్మహత్య కాదని, హత్యగా భావిస్తున్నట్లు కోర్టు(court)కు తెలిపారు. ఈ కేసుపై తాజాగా దర్యాప్తు జరపాలంటూ ఆమె వేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు గతేడాది కొట్టివేసింది. న్యాయమూర్తి ఏఎస్ సయ్యద్ గత వారం ఇరుపక్షాల తుది వాదనలు విని, ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేశారు.
ఇది కూడా చూడండి: Allari Naresh: నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో!

