నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బ్యూటీ అయిపోయింది. దాంతో ప్రస్తుతం అంతకు మించి అనేలా దూసుకుపోతోంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ.. చివరగా ‘సీతారామం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇదే జోష్‌లో త్వరలోనే పుష్ప2 సెట్స్‌లో జాయిన్ అవబోతోంది. అలాగే విజయ్ ‘వారసుడు’ మూవీలోను నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లోనూ లక్ చెక్ చేసుకునేందుకు రెడీ అవుతోంది అమ్మడు. ఇప్పటికే హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్ మజ్ను’ సినిమాలతో పాటు ‘యానిమల్’ అనే సినిమాలోను నటిస్తోంది. ఇక ఇప్పుడు హిట్ సీక్వెల్ ఆషిఖి3లోను రష్మిక పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ ఆషిఖి 3లో ఈ హాట్ బ్యూటీకి ఛాన్స్ దక్కితే మాత్రం.. జాక్ పాట్ కొట్టినట్టేనని చెప్పొచ్చు. ఇలా అమ్మడికి రోజు రోజుకి డిమాండ్ పెరుగుతునే ఉంది. ఈ నేపథ్యంలో భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్టు తెలుస్తోంది. పుష్ప కోసం అందుకున్న పారితోషికాన్ని డబుల్ చేస్తూ.. పుష్ప2 కోసం ఏకంగా 4 కోట్లు డిమాండ్ చేస్తోందట రష్మిక. అంతేకాదు ఇక నుంచి సినిమాకు 5 కోట్లు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. రీసెంట్గా ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు కూడా ఇంత మొత్తంలో డిమాండ్ చేసినట్టు వార్తలొచ్చాయి. మేకర్స్ కూడా రష్మిక డిమాండ్‌ను బట్టి భారీగానే ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఏదేమైనా శ్రీవల్లి మాత్రం క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవాలని గట్టిగానే ఫిక్స్ అయిందని చెప్పొచ్చు.