ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్న చరణ్.. ఈ సినిమాను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. త్వరలోనే న్యూజిలాండ్‌లో ఓ పాటను షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సాంగ్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నట్టు టాక్. దాదాపు పదిరోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే చర్చ జరుగుతునే ఉంది. ఆర్సీ16ని గౌతమ్ తిన్ననూరితో చేయాలనుకున్నాడు చరణ్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. దాంతో సుకుమార్‌తో తదుపరి సినిమా ఉంటుందని వినిపించింది. ఇప్పటికే ఇంట్రో కూడా షూట్ చేసినట్టు ఈ మధ్యలో వార్తలొచ్చాయి.
అయితే ఇప్పుడు ఓ బాలీవుడ్ దర్శకుడితో మెగా పవర్ స్టార్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్లో మాస్ డైరెక్టర్‌గా పేరున్న రోహిత్ శెట్టి.. చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలకు చెందిన రెండు బడా బ్యానర్లు నిర్మించబోతున్నాయట. త్వరలోనే రోహిత్ శెట్టి.. చరణ్‌కు స్టోరీ నరేట్ చేయబోతున్నాడని బాలీవుడ్ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రోహిత్ శెట్టి.. చరణ్‌ను మెప్పిస్తే మాత్రం.. వీళ్ల కాంబోలో భారీ మాస్ సినిమా ఖాయమని చెప్పొచ్చు.