వారియర్‌గా మెప్పించలేకపోయిన ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా సరే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని చూస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు. అందుకే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేతులు కలిపాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ మూవీతో ఓటిటిలో పర్వాలేదనిపించాడు రామ్. కానీ ఇటీవల’ది వారియర్’ మూవీతో థియేటర్లోకొచ్చిన రామ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాడు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుసామి రొటీన్ మాస్ ఫార్ములా ఏ మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. అందుకే ఈ సారి ఏకంగా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశాడు రామ్.
అఖండ తర్వాత బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రామ్ కోసం హై ఓల్టేజ్ మాసివ్ స్క్రిప్టు లాక్ చేశాడట బోయపాటి. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్.. తాజాగా ఈ నెల 25న లాంఛనంగా ప్రారంభంకానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు షూటింగ్ టైం దగ్గర పడడంతో రామ్‌తో రొమాన్స్ చేయబోయే ముద్దుగుమ్మ ఎవరనేది.. మరో నాలుగైదు రోజుల్లో తేలిపోనుంది. ఇక ఈ పాన్ ఇండియా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నారు. మరి రామ్, బోయపాటికి ఈ సినిమా ఎలాంటి పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చిపెడుతుందో చూడాలి.