Rajamouli: ఎన్టీఆర్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్?

ఎన్టీఆర్,రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ అండ్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటిది.. లేటెస్ట్‌గా ఎన్టీఆర్ పై రాజమౌళి చేసిన కామెంట్ ఒకటి వైరల్‌గా మారింది.

  • Written By:
  • Updated On - May 2, 2024 / 04:04 PM IST

Rajamouli: శాంతి నివాసం వంటి సూపర్ హిట్ సీరియల్ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు రాజమౌళి. ఈ సినిమా నుంచే రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. దీంతో.. ఎన్టీఆర్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత సింహాద్రి సినిమా చేశాడు రాజమౌళి. ఇక ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసింది. యంగ్ టైగర్‌ను స్టార్ చేసిన క్రెడిట్ ఏదైనా ఉందా? అంటే, అది దర్శకధీరుడికే సొంతం.

ఇది కూడా చూడండి: Prajwal Revanna: ప్రజ్వల్‌పై లుక్‌అవుట్ నోటీసు జారీ

సింహాద్రి సినిమా తర్వాత ఎన్టీఆర్‌ను మరో కొత్త కోణంలో చూపించి సాలిడ్ హిట్ ఇచ్చాడు జక్కన్న. అప్పటి వరకు కాస్త బొద్దుగా ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ను పూర్తిగా మారుస్తూ.. యమదొంగ సినిమా చేశాడు రాజమౌళి. ఇక రీసెంట్‌గా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా, గ్లోబల్ క్రేజ్ ఇచ్చాడు. అసలు రాజమౌళికి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఇదే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు జక్కన్న. కాబట్టి.. ఎన్టీఆర్, రాజమౌళి టాలీవుడ్‌లోనే ది బెస్ట్ ఫ్రెండ్ అని అంతా అనుకుంటారు. కానీ రాజమౌళి మాత్రం.. ఎన్టీఆర్ తన ఫ్రెండ్ కాదని చెప్పడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఇది కూడా చూడండి: Padma Awards : పద్మ అవార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎలా నమోదు చేసుకోవాలంటే ?

లేటెస్ట్‌గా.. సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కొరటాల శివ, సుకుమార్, అనిల్ రావిపూడి, గోపిచంద మలినేనితో కలిసి పాల్గొన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో.. ఇండస్ట్రీలో మీకున్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని రాజమౌళిని అడిగింది సదరు యాంకర్. ఈ క్రమంలో.. అక్కడున్న వారంతా ఎన్టీఆర్ అంటూ అరిచారు. కానీ రాజమౌళి మాత్రం.. ఎన్టీఆర్ నాకు మిత్రుడు కాదు, నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్ బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఏదేమైనా.. ఎన్టీఆర్, రాజమౌళి ఒకే కుటుంబంలా కలిసి ఉంటారు. అందుకే.. తనని తమ్ముడిగా ఫిక్స్ అయ్యాడు జక్కన్న.

Related News

SSMB29: మహేష్‌ బాబు, రాజమౌళి.. ఇక అప్పుడే?

జస్ట్ అనౌన్స్మెంట్‌తోనే సంచలనానికి రెడీ అవుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. కానీ అధికారిక ప్రకటన మాత్రం చేయడం లేదు జక్కన్న. ఇప్పటికే అనుకున్న డేట్స్ అన్నీ కూడా అయిపోయాయి. దీంతో ఎస్ఎస్ఎంబీ 29 స్టార్ట్ అయ్యేది అప్పుడేనని అంటున్నారు.