ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి క్రేజ్ నెక్ట్స్ లెవల్లో ఉంది. దాంతో హాలీవుడ్లో కూడా జక్కన్న ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే.. ఔననే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ తర్వాత హాలీవుడ్ను అట్రాక్ట్ చేశాడు జక్కన్న. అందుకే ప్రముఖ హాలీవుడ్ సంస్థలు రాజమౌళితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉంటూ.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్తో పాటు ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో మంతనాలు జరుపుతున్నాడు జక్కన్న. ఈ క్రమంలో.. రాజమౌళి హాలీవుడ్ అరంగేట్రం కోసం మార్వెల్ బాస్ ‘కెవిన్ ఫీజ్’ సంప్రదించారనే న్యూస్ వైరల్గా మారింది. తాజాగా రాజమౌళికి ‘హాలీవుడ్లో పని చేసేందుకు మీరు సిద్ధమా.. మార్వెల్ సినిమా కోసం కెవిన్ ఫీజ్ మిమ్మల్ని సంప్రదిస్తున్నారా.. అనే ప్రశ్న ఎదురైంది.
దానికి రాజమమౌళి ఇచ్చిన ఆన్సర్ ఆసక్తికరంగా మారింది. ‘హాలీవుడ్ నుండి చాలా ఎంక్వైరీలు వస్తున్నాయి.. కానీ ప్రస్తుతం మహేష్ బాబుతో కమిట్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అయితే హాలీవుడ్ పని తీరు.. వారి పద్దతి తెలుసుకుంటున్నాను.. ఒకరికొకరం కలిసిమెలిసి ఎలా సహకరించుకోవచ్చు.. అనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. ఈ లెక్కన ఫ్యూచర్లో రాజమౌళి హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ప్రపంచమంతా చుట్టేలా..
ఇండియానా జోన్స్ తరహాలో మహేష్ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే మహేష్ సినిమా కోసం కొన్ని హాలీవుడ్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు రాజమౌళి. కాబట్టి మహేష్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి నుంచి హాలీవుడ్ ప్రాజెక్ట్ ఆశించడంలో ఎలాంటి సందేహాలు లేవనే చెప్పాలి. అయితే ముందుగా మహేష్ సినిమా కంప్లీట్ అవడానికి రెండు, మూడేళ్లు సమయం పట్టనుంది. ఆ తర్వాత రాజమౌళి హాలీవుడ్ ఎంట్రీ విషయంలో క్లారిటీ రానుంది.