ప్రకాశం: కనిగిరిలో 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏఐటీయూసీ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం, సీపీఐ పార్టీ కార్యాలయాల ఎదుట ఏఐటీయూసీ జెండాను జిల్లా అధ్యక్షుడు సయ్యద్ యాసిన్ ఆవిష్కరించారు. కార్మికుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ ఏఐటీయూసీ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర బాబు, బాలిరెడ్డి, రామారావు, తదితరులు పాల్గొన్నారు