స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన పుష్ప సినిమా సెకండ్ పార్ట్ పై.. పాన్ ఇండియా లెవల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా అప్డేట్స్ అంటే లీకులు ఉంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
Pushpa 2: పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత.. పార్ట్ 2 స్టోరీ మొత్తం మార్చేసినట్టున్నాడు సుకుమార్. ముఖ్యంగా హిందీలో పుష్పరాజ్‌కు బ్రహ్మరథం పట్టారు జనాలు. దీంతో.. సెకండ్ పార్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్నాడు మన లెక్కల మాస్టారు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో అద్భుతం అనేలా డిజైన్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల మాట. ఇప్పటికే రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప గ్లింప్స్ అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. అలాగే.. లీకులు కూడా పుష్ప2 మామూలుగా ఉండదని చెబుతున్నాయి.
ముఖ్యంగా జాతర సెటప్‌లో అల్లు అర్జున్ అమ్మవారు గెటప్‌కు థియేటర్లు బ్లాస్ట్ అవడం గ్యారెంటీ అని అంటున్నారు. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్‌లో ఉంటుందని అంటున్నప్పటికీ.. లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్‌లోనే ఉంటుందని సమాచారం. ఇది సెకండాఫ్‌కు ఇచ్చే హై గూస్ బంప్స్ తెప్పిస్తుందట. ఈ ఎపిసోడ్ కోసం దాదాపు 50 కోట్లు ఖర్చు చేసిన్నట్లు టాక్. మొత్తంగా.. ఈ సీక్వెన్స్ 25 నిమిషాల పాటు ఉండబోతున్నట్లు సమాచారం.
ఈ ఎపిసోడ్ సమయంలో ఆడియెన్స్‌కు ఫ్యాన్స్‌కు పూనకాలు రావడం పక్కా అంటున్నారు. దీంతో రోజురోజుకు పుష్ప2 పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగష్టు 15న విడుదల కానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలా ఉంటుందో చూడాలి.