KNR: చొప్పదండి మండలం కాట్నపల్లిలో శుక్రవారం నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేణుగోపాల్ రావు, ఎంపీవో రాజగోపాల్ రెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి సతీష్, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు శ్రీనివాస్, నవీన్, పాల్గొన్నారు.