PLD: వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ప్రజల విజ్ఞప్తులను విని పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.