మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టినట్టుగా మేకర్స్ ప్రకటించారు.
Profits within three days.. 'Gami' is a super hit!
Gami: మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వవ వహించిన ఈ సినిమాలో చాందిని హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం ఐదారేళ్లుగా కష్ట పడింది చిత్ర యూనిట్. ఫైనల్‌గా గామికి హిట్ టాక్ రావడంతో.. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. మహా శివరాత్రి కానుకగా మార్చి 8న రిలీజ్ అయిన గామి.. మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఫస్ట్ డే 9.07 కోట్లు, రెండో రోజు 6.03 కోట్ల వసూళ్లతో రెండు రోజుల్లో 15.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు కూడా అదే జోరు చూపించింది. థర్డ్ డే 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. ఓవరాల్‌గా మూడు రోజుల్లో 20.3 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. సక్సెస్ ఫుల్‌గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న గామి.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసుకొని.. అన్ని ఏరియాలలో లాభాల బాట పట్టినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
దీంతో మూడు రోజుల్లోనే ఈ సినిమా సూపర్ హిట్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ఇక అమెరికాలో కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది గామి. వీకెండ్ నాటికి 500K డాలర్స్ రాబట్టి.. 1 మిలియన్ డాలర్ మార్క్ వైపుగా దూసుకుపోతుంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. అమెరికాలో రోజురోజూ గామి స్క్రీన్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ మూవీని విజువల్ ట్రీట్‌గా మలిచిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి.. లాంగ్ రన్లో గామి ఎంత రాబడుతుందో చూడాలి.