టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేరళ, కన్నడ పరిశ్రమలతో పాటుగా సౌత్‌లో బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ ప్రస్తుతం పుష్ప2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీతో ఫోటో దిగేందుకు చాలా మంది పోటీపడుతుంటారు. ఆయనతో ఫోటో దిగితే చాలని, ఆ అవకాశం కోసం మరికొందరు ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీరాభిమానికి అంతకుమించిన అవకాశం దక్కింది.
ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ వైజాగ్‌లో సాగుతోంది. 18 రోజుల పాటు బ్రేక్ లేకుండా ఈ షూటింగ్ జరిగింది. ఫిబ్రవరి 6న ఆ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న బన్నీ హైదరాబాద్‌కు బయల్దేరారు. ఆ సమయంలో అభిమానుల కోసం వైజాగ్ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ బన్నీతో ఫోటో దిగేందుకు తెగ పోటీ పడ్డారు. ఆ క్రమంలోనే అక్కడికి వచ్చిన బన్నీ వీరాభిమానిని గుర్తించాడు. దివ్యాంగుడైన ఆ అభిమానిని బన్నీ ఎత్తుకుని మరి ఫోటో దిగాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.