భారత దేశవ్యాప్తంగా దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా మన హైదరాబాద్ నుంచే మొదలుపెడుతున్నట్లు తెలిపారు. మరీ కాన్సెర్ట్ ఎప్పుడూ, టికెట్లు తదిర అంశాలు కూడా వెల్లడించారు.
ఇటీవలే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన చైల్డ్ అబ్యూసింగ్ అలాగే తండ్రీకూతుళ్ల బంధంపై ఓ యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం సిరీయస్‌గా తీసుకుంది. ఫలితంగా నిందితుడిని అరెస్ట్ చేసింది. ఈ విషయం వెంటనే స్పందించినందకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ది గోట్ లైఫ్ తెలుగులో ఆడు జీవితం చిత్రం ఓటీటీలోకి రావడానికి సిద్ధంగా ఉంది. థియేటర్లో మంచి స్పందన వచ్చింది. అయితే ఓటీటీకి రావడానికి మాత్రం కాస్త టైమ్ తీసుకుంది. ఇంతకీ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుంది, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనేది చూద్దాం.
ఉలగనాయగన్ కమల్ హాసన్ మెయిన్ లీడ్రోల్లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఇండియన్ 2. భారతీయుడు 2 గా తెలుగులో విడుదలైన ఈ చిత్రం విడదలైన మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. నిడివి కూడా ఒక కారణం కావడంతో చిత్ర యూనిట్ రన్ టైమ్ తగ్గించింది.
నటీనటులను, వాళ్ల కుటుంబ సభ్యులను ట్రోల్ చేసి, అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) తెలిపింది.
బాలీవుడ్ స్టార్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకోబోతున్నట్టుగా చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే.. ఇప్పుడు ఈ ఇద్దరు విడిపోవడం నిజమేనని అంటున్నారు. అందుకు అంబానీ ఇంట జరిగిన పెళ్లితోనే తెలిసిందని చెబుతున్నారు.
నిజమే.. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతుంటే, ఇప్పుడు శంకర్ కూడా భయపెట్టేశాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. మరి ఎందుకలా భయపడుతున్నారంటే?
ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కనీసం హిందీ సినిమాలు కూడా చేయలేదు. కానీ బాలీవుడ్లో మహేష్ బాబు క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. పాన్ ఇండియా స్టార్‌కు మించిన ఫాలోయింగ్ ఉంది.
'కల్కి 2898 AD' మూవీ రెండు వారాలు కంప్లీట్ చేసుకొని మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 2024లో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది కల్కి. అంతేకాదు.. రిలీజ్ అయిన రోజు నుంచి ప్రతిరోజూ కొత్త రికార్డులను బద్దలు కొడుతోంది.
బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ చేసిన సినిమాలన్నీ బాక్సీపీసు వద్ద బోల్తా పడుతున్నాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. తాజాగా వచ్చిన సర్ఫిరా సినిమా కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అక్షయ్ కుమార్ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పరాజయాల పరంపర నుంచి అక్షయ్ కుమార్ ఎందుకు బయట పడలేకపోతున్న...
దేవర సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్టేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గిరిజన తెగ చెందిన నాయకుడుగా కనిపించనున్నాడని చెప్పుకొచ్చాడు.
జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది 'కల్కి 2898 ఏడి' సినిమా. డే వన్ నుంచి భారీ వసూళ్లు రాబడుతున్న కల్కి.. ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. దీంతో.. అమితాబ్ బచ్చన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్‌ను సినిమాల్లో చాలా స్టైలిష్‌గా చూసి ఉంటారు. కానీ రియల్ లైఫ్ రజినీ వేరు. నిజ జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారు సూపర్ స్టార్. అలాంటి రజినీ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేయడమంటే మాటలు కాదు. కానీ అంబానీ పెళ్లిలో అది జరిగింది.
ఐదారేళ్లుగా డిలే అవుతు వచ్చిన భారతీయుడు సీక్వెల్.. ఫైనల్‌గా జూలై 12న గ్రాండ్‌గా థియేటర్లోకి వచ్చింది. అయితే.. ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ.. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో డే1 వసూళ్లు యావరేజ్‌గా ఉన్నాయని అంటున్నారు.
టి రోహిణి ఇటీవల బర్త్‌డే బాయ్ ప్రమోషన్స్‌లో భాగంగా రేవ్ పార్టీ థీమ్‌తో ఓ ప్రాంక్ వీడియో చేసింది. దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ తన గురించి వ్యక్తిగత విమర్శలు చేశారు. అతనిపై మండిపడుతూ తాజాగా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.