నిహారిక కొణిదెల సమర్పణలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఆగస్టు 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంకా ఈ మూవీ రేపటితో 50 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 7 గంటలకు HYDలోని మైత్రీ విమల్ థియేటర్‌లో స్పెషల్ షో వేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేస్తూ.. ఈ షోను మూవీ టీంతో కలిసి చూడవచ్చని మేకర్స్ తెలిపారు.
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్థంతి సందర్భంగా ఆయనను ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ శకాన్ని తన పరం చేసుకున్న మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. బాలుగారి వర్ధంతి సందర్భంగా ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి స్మృతికి నివాళి అర్పిస్తున్నాను’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
చాలామంది యువత డ్రగ్స్‌కు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్‌కు ఆకర్షితులై ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితం చాలా విలువైందని, డ్రగ్స్‌కు బానిసలు కావొద్దని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వానికి ...
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘క’. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ మేరకు సెట్స్‌లో మూవీ టీం మొత్తం కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు దర్శకత్వం వహించారు.
ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు విడాకుల కోసం ముంబై కోర్టులో 4 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం J&Kకు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్...
ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు విడాకుల కోసం ముంబై కోర్టులో 4 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం J&Kకు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్...
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, ‘2018’ మూవీ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై జోసెఫ్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ కథ పరంగా రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. కాగా, రజినీ నటించిన ‘వేట్టయాన్’ మూవీ దసరాకు రిలీజ్ కానుంది.
మలయాళ హిట్ మూవీ ‘అంచక్కల్లకోక్కన్’ తెలుగు వెర్షన్ OTTలోకి రాబోతుంది. ఈ సినిమా ‘చాప్రా మర్డర్ కేస్’ పేరుతో ఆహాలోకి వచ్చేస్తుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా మలయాళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
బాలీవుడ్ సినిమా ‘లాపతా లేడీస్’ భారత్ నుంచి 2025 ఆస్కార్‌కు ఎంపికైంది. ఈ మూవీలో నటించిన నటి ప్రతిభ రత్న ఆనందం వ్యక్తం చేశారు. ‘మా కష్టానికి ఫలితం దక్కింది. ఈ మూవీ మన దేశం నుంచి ఆస్కార్‌కు సెలెక్ట్ అవ్వాలని బలంగా కోరుకున్నాం. అది నెరవేరింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పని చేస్తూ పోతే రిజల్ట్స్ వాటంతట అవే వస్తాయి. నా విషయంలో అదే జరుగుతోంది’ ...
తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మీరు ఎందుకు సెటైర్లు వేస్తున్నారని ప్రశ్నించారు. స్పందిస్తే స్పందించండి.. లేదంటే మౌనంగా ఉండాలని సూచించారు. అంతేకానీ సనాతన ధర్మం గురించి అపహాస్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్న ఓ ఆడియో ఫంక్షన్‌లో లడ్డూ గురించి చులకనగా మాట్లాడటాన...
తమిళ స్టార్ విజయ్ దళపతి, డైరెక్టర్ వెంకట్ ప్రభు కాంబోలో రూపొందిన సినిమా ‘GOAT'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). సెప్టెంబర్ 5న రిలీజై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా OTTలోకి వచ్చేందుకు సిద్ధమైంది. దీని డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్లకు కొనుగోలు చేసిందట. ఈ మూవీ అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి రేపు ఓ ప్రకటన రాబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. అయితే ఇటీవల ఈ మూవీ రెండో పాటను సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పాటపై ఏమైనా అప్డేట్ ఇవ్వబోతున్నారా..? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.