2022లో కన్నడలో రిలీజై హిట్ అందుకున్న ‘లవ్ మాక్టైల్ 2’ మూవీ తెలుగు వెర్షన్ ఈ ఏడాది జూన్లో విడుదలైంది. డైరెక్టర్ డార్లింగ్ కృష్ణ స్వీయదర్శకత్వంలో నటించిన ఈ మూవీ OTTలోకి రాబోతుంది. ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది. ఇక ఈ సినిమాలో మిలనా నాగరాజ్, రాచెల్ డేవిడ్, అమృత అయ్యంగార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.