యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ ఫిల్మ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అందుకోవడంతో.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ రేంజ్లో ఊహించుకుంటున్నారు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ తన లైనప్ సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అయ్యాడు.
అయితే ఈ సినిమాలను సెట్స్ పైకి మాత్రం తీసుకెళ్లడం లేదు. కానీ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్‌తోనే రంగంలోకి దిగబోతున్నాడట. వాస్తవానికి ఎన్టీఆర్ 30 ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ ఆచార్య మూవీతో కొరటాల డస్టర్బ్ అవడంతో.. లేట్ అయింది. అయితే ఇప్పుడు అంతా క్లియర్ అయింది. ఇప్పటికే ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరుగుతోంది. లొకేషన్ వేటలో కూడా ఉంది చిత్ర యూనిట్. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన ఎన్టీఆర్.. నాన్ స్టాప్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడట.
కొరటాల సినిమాని డిసెంబర్లో స్టార్ట్ చేసి.. ఎక్కువ బ్రేక్స్ లేకుండా.. త్వరగా షూట్ ఫినిష్ చేయాలని చూస్తున్నాడట. అలాగే ముందుగా అనుకున్నట్టు.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ని వచ్చే సమ్మర్లోనే మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కాకపోతే కొరటాల ప్రాజెక్ట్ ఎండింగ్లో ప్రశాంత్ నీల్ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమవనుంది.
ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ 31ని కూడా పరుగులు పెట్టించాలనే ఆలోచనలో ఉన్నాడట. మొత్తంగా 2023లో తారక్ క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉండబోతున్నాడట. ఇప్పటికే నెక్ట్స్ ఇయర్ కాల్షీట్ డేటా ఫుల్ అయిందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ నుంచి సాలిడ్ అప్టేట్స్ రాబోతున్నట్టు టాక్. మరి ఎన్టీఆర్ ఈ సినిమాలతో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.