అక్కినేని నాగ చైతన్య హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ఓ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య కెరీర్లో 22వ మూవీగా ఈ సినిమా తెరెక్కుతోంది. దాంతో NC 22 వర్కింగ్ టైటిల్‌తోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. నవంబర్ 23 నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా.. టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ‘కస్టడీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో చైతూ.. ఎ. శివ అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఇక కస్టడీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. చైతన్య లుక్ పవర్ ఫుల్‌గా ఉంది. పోలీసుల కస్టడీలో ఉన్న చైతన్యను.. పాయింట్ బ్లాంక్‌లో గన్స్ గురిపెట్టి.. పట్టుకుని అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు.
దాంతో ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతోందని చెప్పొచ్చు. మొత్తంగా కస్టడీ లుక్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇంతకు ముందు ‘బంగార్రాజు’ సినిమాలో చైతన్యతో కలిసి రొమాన్స్ చేసింది కృతి. ఆ సినిమా ఓకే అనిపించుకుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది.
అందుకే ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తోందనే ప్రచారం జరుగింది. కానీ అవన్నీ పుకార్లకే పరిమితమయ్యాయి. ఇక ‘కస్టడీ’లో అరవింద స్వామి విలన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. అయితే థ్యాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు ఆకట్టుకోకపోవడంతో.. ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు నాగ చైతన్య.