ఈ సారి దసరాకు నందమూరి బాలకృష్ణ నుంచి డబుల్ ధమాకా రాబోతోంది. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నుంచి.. దసరా రోజు టైటిల్‌తో పాటు ఏదైనా వీడియో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక ఈ సినిమా అప్టేడ్తో పాటు బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్2 సీజన్ టైం రానే వచ్చేసింది. ఊహించని విధంగా బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన ఆహా ‘అన్‌స్టాపబుల్’ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ షోలో బాలయ్యలోని మరో కోణాన్ని చూసి ఫిదా అయిపోయారు అభిమానులు. బాలయ్య అద్భుతమైన హోస్టింగ్‌తో ఈ టాక్ షో అన్ స్టాపబుల్‌గా సాగిపోయింది. దాంతో ఈ సారి అంతకు మించి అనేలా అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ రాబోతోంది. మరి కొద్ది రోజుల్లో సీజన్-2 ప్రారంభం కానుంది. రీసెంట్గా దీనికి సంబంధించి యాంథమ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్ డేట్‌ను ప్రకటించారు. అన్‌స్టాపబుల్ సీజన్-2 ట్రైలర్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ.. NBK IS BACK అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలయ్య కౌ బాయ్ గెటప్‌లో కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్లో షో స్ట్రీమింగ్ డేట్‌తో పాటు గెస్ట్‌లను కూడా రివీల్ చేసే అవకాశముంది. ఏదేమైనా మరోసారి బాలయ్య ఈ షోని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడం ఖాయం.