finally.. పవిత్ర లోకేశ్‌ను పెళ్లాడిన నరేశ్.. వీడియో ట్వీట్
Naresh and Pavitha Lokesh are Knot:నటుడు నరేశ్ (naresh)- పవిత్ర లోకేశ్ (pavitra) ప్రేమాయణం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యింది. నరేశ్ భార్య రమ్య రఘుపతి (ramya) అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. పవిత్ర లోకేశ్‌ను (pavitra) నరేశ్ (naresh) పెళ్లి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైసూరులో (mysore) కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారని సమాచారం.
Naresh and Pavitha Lokesh are Knot:నటుడు నరేశ్ (naresh)- పవిత్ర లోకేశ్ (pavitra) ప్రేమాయణం గత కొద్దిరోజుల నుంచి హాట్ టాపిక్ అయ్యింది. నరేశ్ భార్య రమ్య రఘుపతి (ramya) అభ్యంతరం వ్యక్తం చేయడంతో రచ్చ రచ్చ అయ్యింది. పవిత్ర లోకేశ్‌ను (pavitra) నరేశ్ (naresh) పెళ్లి చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మైసూరులో (mysore) కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు కొత్త జీవితాన్ని ప్రారంభించారని సమాచారం. కొంతకాలం నుంచి వీరిద్దరూ డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ (new year) సందర్భంగా పవిత్రను నరేశ్ కిస్ చేసి.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నానని హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు ఒక్కటయ్యారు.
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్లు
ఏడు అడుగులు
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
మీ #పవిత్ర నరేశ్ అంటూ నరేశ్ ట్వీట్ చేశారు.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం రెండు మనసులు మూడు ముళ్ళు ఏడు అడుగులు 🙏
మూడో భార్య రమ్య రఘుపతి (ramya) నరేశ్‌కు (naresh) విభేదాలు ఉన్నాయి. అందుకే నరేశ్- పవిత్ర పెళ్లి ఆలస్యమైంది. అంతకుముందు రమ్య (ramya) నుంచి తనకు ప్రాణ హానీ ఉందని నరేశ్ (naresh) ఆరోపించారు. ఆస్తి కోసం తనను చంపేందుకు ప్రయత్నిందని ఆరోపించారు. ఇదే విషయం కోర్టులో (court) ఫిర్యాదు చేశానని వివరించారు. ప్రాణ భయంతో బయటకు వెళ్లడం లేదన్నారు. ఓ పోలీస్ అధికారి సాయంతో తన ఫోన్‌ను రమ్య హ్యాక్ చేయించిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన పర్సనల్ మెసేజ్ రమ్య చూసేదన్నారు. రమ్యతో విడాకులు ఇప్పించాలని కోరారు.
2010 మార్చిలో రమ్యతో (ramya) పెళ్లి జరిగిందని నరేశ్ (naresh) వివరించారు. రెండేళ్లకు బాబు (son) జన్మించాడని తెలిపారు. పెళ్లైన కొన్ని నెలల నుంచే రమ్య (ramya) వేధించడం స్టార్ట్ చేసిందన్నారు. రమ్యకు తన తల్లి విజయ నిర్మల (vijaya nirmala) రూ. 30 లక్షల విలువ గల ఆభరణాలను చేయించిందని చెప్పారు. తనకు తెలియకుండా రమ్య రూ.లక్షల్లో అప్పులు చేసిందని చెప్పారు. అప్పుల్లో రూ. 10 లక్షలను (10 lakhs) తీర్చేశానని వివరించారు. తన కుటుంబ సభ్యుల నుంచి కూడా రూ. 50 లక్షల (50 lakhs) అప్పు చేసిందని నరేష్ ఆరోపించారు.
గత ఏడాది బెంగుళూరులో ఓ హోటల్లో పవిత్ర లోకేష్‌తో నరేష్ కలిసి ఉన్నారు. ఆ సమయంలో రమ్య రఘుపతి పోలీసులతో కలిసి వచ్చి.. వారిపై దాడికి ప్రయత్నించారు. అప్పటినుంచి నరేశ్- పవిత్ర లోకేశ్ రిలేషన్ షిప్ హైప్ అయ్యింది. ఇప్పుడు నరేశ్- పవిత్ర ఒక్కటయ్యారని తెలిసింది.