»Mp Raghav Chadha And Parineeti Chopra Got Engaged
Parineeti Chopra: ఘనంగా ఎంపీ రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా నిశ్చితార్థం
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఎంపీ రాఘవ్ (Raghav Chadha) చద్దాతో బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా (Parineeti Chopra) నిశ్చితార్థం వేడుకగా జరిగింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఎట్టకేలకు వీరిద్దరూ ప్రేమ బంధం నుంచి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో వీరి నిశ్చితార్థం వేడుకగా జరిగింది.
రాఘవ్ చద్దా (Raghav Chadha), పరిణితి చోప్రా (Parineeti Chopra) కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు రాజకీయ నేతలు సహా దాదాపు 150 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అతిథుల సమక్షంలో ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. తమ ఎంగేజ్మెంట్ ఫోటోలను రాఘవ్, పరిణీతి తమ ఇన్ స్టా ఖాతాల్లో షేర్ చేశారు.
త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, పరిణీతి సోదరి సినీనటి ప్రియాంకా చోప్రా, రాజకీయ నేతలు చిదంబరం, ఆదిత్య ఠాక్రే, తృణమాల్ వంటివారు హాజరయ్యారు. నిశ్చితార్థం వేడుక సందర్భంగా ముంబైలోని పరిణీతి చోప్రా (Parineeti Chopra) నివాసం, ఢిల్లీలోని రాఘవ్ చద్దా (Raghav Chadha) నివాసం వద్ద ప్రత్యేక విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.