Rajamouli: రాజమౌళికి మహేష్ బాబు బిగ్ షాక్.. లైన్లోకి మరో డైరెక్టర్?
ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ మాత్రమేనని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో కన్ఫామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
రాజమౌళి, మహేష్ బాబు అవైటేడ్ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు బయటికొస్తుందా? అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్. ప్రస్తుతం రాజమౌళి తండ్ర విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు వర్క్‌తో బిజీగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చే ఇంటర్య్వూల్లో అదిరిపోయే అప్డేట్స్ మాత్రం ఇస్తునే ఉన్నాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో.. ఆఫ్రికా నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతోందని.. మరోసారి క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఈ సినిమాలో కొందరు హాలీవుడ్ నటులు కూడా భాగం కాబోతున్నారని విజయేంద్రప్రసాద్ తెలిపారు. వాస్తవానికి ముందు నుంచి ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ యాక్టర్స్ ఇన్వాల్వ్ కాబోతున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పటికే జక్కన్న హాలీవుడ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఇలా ఎస్ఎస్ఎంబీ 29 గురించి ఏదో ఒక వార్త వినిపిస్తునే ఉంది. కానీ లేటెస్ట్ రూమర్ మాత్రం మహేష్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెబుతున్నట్టుగా ఉంది. SSMB29 ప్రాజెక్ట్ రాజమౌళి నుంచి అనీల్ రావిపూడి చేతికి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అయిపోయిన తర్వాత SSMB 30ని డైరెక్ట్ చేయనున్నాడట రాజమౌళి.
ఈ సినిమా మరింత లేట్ అవనుందని.. అందుకే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ రూమర్స్‌లో నిజమెంత అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ.. గుంటూరు కారం తర్వాత మహేష్ చేయబోయేది రాజమౌళి సినిమానే అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే.. ఎప్పుడు చేసినా మహేష్ సినిమాను ఊహకందని విధంగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 800 నుంచి వెయ్యి కోట్లనే టాక్ నడుస్తోంది.