Leo: లోకేష్ షాకింగ్ కామెంట్స్.. ‘లియో’ ఫస్ట్ ఛాయిస్ విజయ్ కాదు!
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన లియో సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వసూళ్లు నిజమా? కాదా? అని ట్రేడ్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో లోకేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అసలు లియో సినిమా టాక్‌కు కలెక్షన్స్క సంబంధమే లేదని.. మొదటి నుంచి వినిపిస్తున్న మాట. అయినా కూడా లియో బాక్సాఫీస్ ఫిగర్లు మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల లెక్కల ప్రకారం.. తమిళనాడులో 185 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 44 కోట్లు, కర్నాటకలో 36 కోట్లు, కేరళలో 54 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 30 కోట్లు, ఓవర్సీస్లో 178 కోట్లకు పైగా వసూలు వచ్చినట్టు చెబుతున్నారు. మొత్తంగా 530 కోట్లు గ్రాస్, 266 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని అంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా లియో బిజినెస్ ప్రకారం చూస్తే.. 215 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. ఈ లెక్కన ఇప్పటికే లియోకి 50 కోట్లు లాభాలు వచ్చాయన్న మాట. కానీ లియో అసలు లెక్కలు వేరే ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ మాత్రం.. తానెప్పుడూ కలెక్షన్స్ గురించి పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. లియో కలెక్షన్స్ ఎంతన్నది ప్రొడ్యూసర్లను అడిగితే బెటర్.. ఆ లెక్కలు తనకు అనవసరం అంటూ చెప్పాడు.
అలాగే ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. ‘వాస్తవానికి 5 సంవత్సరాల క్రితం వేరే హీరోని దృష్టిలో పెట్టుకుని లియో కథను రాసుకున్నాను. కానీ అనుకున్న కాస్టింగ్ సెట్ అవలేదు. అందుకే.. మాస్టర్ సినిమా కోసం విజయ్‌తో కలిసి పనిచేసిన తర్వాత, మరోసారి ఆయనతో కలిసి లియో సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. దీంతో లియో ఫస్ట్ ఛాయిస్ ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లోకేష్ పేరు చెప్పకపోయినా.. ఆ హీరో కమల్ హాసన్ అనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా.. టాక్‌తో సంబంధం లేకుండా లియో మాత్రం సెన్సేషన్ అనే చెప్పాలి.