వరుస్ ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి కాస్త కంటెంట్ ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపుతున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా పై మొదటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్స్, థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాతో అల్లరోడు మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమంటున్నారు. ఈ నెల 25న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఆ రోజు మరికొన్ని సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.
కానీ అల్లరోడికి పోటీగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించి, దర్శకత్వం వహించిన ‘లవ్ టుడే’ అనే సినిమా రిలీజ్ అయింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా.. తమిళ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు.
తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాను కూడా నవంబర్ 25న రిలీజ్ చేస్తున్నారు. దాంతో అల్లరోడికి పోటీ తప్పేలా లేదంటున్నారు. ఇటీవల కన్నడ నుంచి వచ్చిన డబ్బింగ్ సినిమా ‘కాంతార’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు లవ్ టుడే కూడా అల్రేడి హిట్ కాబట్టి.. తెలుగులోను అంచనాలు బాగానే ఉన్నాయి. కాబట్టి అల్లరి నరేష్‌కు గట్టి పోటీ తప్పదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.