బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
కంగనా రనౌత్(Kangana Ranaut) కేవలం సినిమాల పరంగా మాత్రమే కామెంట్స్ చేయదు.. పొలిటికల్ పరంగాను ఊహించన విధంగా స్పందిస్తూ ఉంటుంది. అందుకే తనపై అందరు పగ పట్టారని చెబుతుంటుంది. అయితే తాను రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం వల్ల.. ఏటా 30 కోట్లు నుంచి 40 కోట్లు లాస్ అవుతున్నాని చెబుతోంది కంగనా. ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్(Elon musk) ఇంటర్వ్యూను షేర్ చేస్తూ.. నిజాలు మాట్లాడినందుకు చాలా కోల్పోవాల్సి వస్తుంది.. అంటూ రాసుకొచ్చింది. నిజమైన స్వాతంత్ర్యం, విజయం, హిందూ మతం కోసం మాట్లాడటం, రాజకీయ నాయకులు, జాతీయ వ్యతిరేకులు, తుక్డే గ్యాంగ్.. నన్ను 20 నుంచి 25 బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కోల్పోయేలా చేశాయి.
రాత్రికి రాత్రే పక్కకు పెట్టేయడం కోట్ల నష్టం జరిగింది. కానీ నేను స్వేచ్ఛగా ఉన్నా అంటూ తెలిపింది కంగనా. నిజానికి ప్రతి ఒక్కరూ బలహీనతలను మాత్రమే ప్రదర్శిస్తారు. అందుకే నేను ఎలన్ను అభినందిస్తున్నాను. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి పట్టించుకోకూడదని పేర్కొంది. ఇకపోతే.. గత ఏడాది కంగనా నటించిన ధకడ్ మూవీ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే సినిమాతో పాటు లారెన్స్ సరసన చంద్రముఖి-2 సినిమాల్లో నటిస్తోంది. ఏదేమైనా.. ఫైర్ బ్రాండ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే.