Mega Festival: ఇది మెగా ఫెస్టివల్ బ్రో.. భోళా శంకర్ రెడీ!
మెగా బ్రదర్స్ ఇద్దరు డబుల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకేసారి కొత్త సినిమాలతో సందడి చేయబోతున్నారు. 'బ్రో'గా పవన్ వస్తుండగా.. భోళా శంకర్‌గా మెగాస్టార్ వచ్చేస్తున్నాడు. అయితే బ్రో రిలీజ్‌కు ఓ రోజు ముందే భోళా శంకర్ ట్రైలర్ వస్తుండడంతో.. మెగా ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా ‘భోళా శంకర్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లెలి పాత్రలో నటిస్తోంది. సుశాంత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆగష్టు 11న భోళా శంకర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటి వరకు భోళాశంకర్ నుంచి మూడు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి.
అందులో మెగాస్టార్ స్టైల్ చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇక ఇప్పుడు భోళా శంకర్ ట్రైలర్ రాబోతోంది. ఈ ట్రైలర్‌ను జూలై 27న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు అఫిషీయల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. మెగా ఎంటర్టైనింగ్ యాక్షన్ అద్భుతానికి రెడీగా ఉండండని అన్నారు. దాంతో బోళా శంకర్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అంతేకాదు.. బ్రో సినిమా కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.
జులై 27న ‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్ అవుతుండగా.. జులై 28 న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్ కానుంది. ఇలా ఒకేసారి మెగాస్టార్, పవర్ స్టార్ సందడి చేస్తుండడంతో.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీటేనని చెప్పాలి. అయితే భోళా శంకర్ ట్రైలర్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. బ్రో ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో భోళా శంకర్ ట్రైలర్ కూడా అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు. మరి భోళా శంకర్ ఏం చేస్తాడో చూడాలి.