టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే 'హాయ్ నాన్న' సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా మనసులో మాట బయటపెట్టాడు నాని(nani).
చివరగా ఊరమాస్ సినిమా ‘దసరా’తో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని(nani). అయితే..పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా..ఒక్క తెలుగులో మాత్రమే హిట్ అయింది. మిగతా భాషల్లో ఆకట్టుకోలేకపోయింది. అందుకే.. మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో పాన్ ఇండియా మార్కెట్ కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా ‘హాయ్ నాన్న’. ఈ సినిమాతో శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడిని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు నాని. డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు నాని. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోయింది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటించగా, మృణాల్ ఠాకూర్ అతని భార్యగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నాని చేసిన కామెంట్స్(c0mments) ఇప్పుడు వైరల్‌గా మారాయి. తనకు ఒక కూతురు ఉంటే బాగుండు.. అని తన మనసులో మాటను బయటపెట్టాడు.
2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాని. 2017లో నాని దంపతులకు బాబు పుట్టాడు. అందుకే.. ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ‘నేను ఒక కూతురికి తండ్రి కావాలని కోరుకుంటున్నాను, అల్రేడీ నేను ఒక కొడుకు తండ్రిని. ఇప్పుడు హాయ్ నాన్న సినిమా వల్ల కూతురికి తండ్రిగా అనుభవం వచ్చింది. కాబట్టి కూతురు కావాలనే కోరిక మరింత పెరిగిందని చెప్ప్పుకొచ్చాడు. దీంతో.. నాని దంపతులు మరొక బిడ్డ(daughter) గురించి ఆలోచిస్తున్నారా? అనే చర్చ మొదలైంది. త్వరలోనే నాని గుడ్ న్యూస్ చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు.