How is the trailer of Varun Tej's Operation Valentine?
Operation Valentine: తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే మంచి గుర్తింపు ఉంది. ఎక్కువ మంది హీరోలతో పాటు ప్రత్యేకమైన స్టార్డమ్ ఉన్న హీరోలు ఉండడం, అదే స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారు. అదే కంపౌండ్ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఒకడు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ తేజ్‌కు ఈ మధ్య సరైన హిట్ లేదు. తాజాగా మరో సినిమాతో వస్తున్నారు. అదే ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine). తాజాగా ట్రైలర్ విడుదల అయింది. ఒంటి నిండగాయాలతో ఉన్న హీరో గతంలో ఏదో పెద్ద సంఘటన జరిగింది అనే క్యూరియాసిటీతో ట్రైలర్ మొదలు అవుతుంది. ఎయిర్‌ఫోర్స్ అధికారిగా చేసిన సాహసాలు, చెప్పిన కథతో దీన్ని నడిపించారు. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ శిబిరంపై జరిగిన దాడిని, తర్వాత భారత వైమానిక సైన్యం తిరుగుబాటును హైలైట్ చేశారు.
చదవండి:Siddu Jonnalagadda: ప్రమాదంలో సిద్ధు జొన్నలగడ్డ కెరీర్..?
ట్రైలర్లో చూసుకుంటే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక హీరో వరుణ్ తేజ్ లుక్స్ కూడా చాలా స్పెషల్‌గా ఉన్నాయి. విజువల్స్ ఎంతో రిచ్‌గా ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగులు దేశ భక్తిని రగిలించేలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన ఈ మూవీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఉందని తాజా ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. నిజానికి ఆపరేషన్ వాలెంటైన్ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేయాల్సి ఉండే కానీ అనుకోని కారణాల వలన దీన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేసేశారు. ఈ చిత్రంలో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్(Manushi Chiller) హీరోయిన్గా నటిస్తోంది. రుహానీ శర్మ, నవదీప్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.
చదవండి:Mastu Shades vunnaira Neelo: హీరోగా మరో కమెడియన్

