యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో.. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన హిట్ సినిమా.. అప్పట్లో మంచి హిట్ అందుకుంది. దాంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘హిట్ 2’తో మరోసారి హిట్ కొట్టేద్దామంటున్నారు న్యాచురల్ స్టార్ నాని మరియు యంగ్ హీరో అడివి శేష్. ఇప్పటి కే ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. పైగా అడివి శేష్ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు కాబట్టి..
హిట్ 2 సరికొత్త క్రైమ్‌తో రాబోతోందని చెప్పొచ్చు. ఇప్పటికే నాని, అడివి శేష్ ఈ సినిమా ప్రమోషన్స్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను లాక్ చేశారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. హైదరాబాద్.. ఫిల్మ్ నగర్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ అందుకు వేదిక కానుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరనేది ఊహించండి.. అంటూ సస్పెన్స్‌లో పెట్టారు మేకర్స్.
అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌలి ముఖ్య అతిథిగా రాబోతున్నారని వినిపించింది. కానీ ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికాలో ఉన్నాడు. కాబట్టి రాజమౌళి రాక గురించి ఇప్పుడే చెప్పలేం. దాంతో హిట్ 2 గెస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇక అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను..
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా హిట్ 2 థియేటర్లలోకి గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. మరి హిట్2 ఈవెంట్ గెస్ట్ ఎవరనేది తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.