హీరో హర్షవర్ధన్ రాణే (Hero Harshavardhan Rane) గురించి రాణే తెలుగులో పలు సినిమాలు నటించాడు.టాలీవుడ్ నటుడైనప్పటికీ తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేదు అవును, ఫిదా, గీతాంజలి(Gitanjali), బెంగాల్ టైగర్ తదితర మువీల్లో నటించినప్పటికీ ఈ రాజమండ్రి కుర్రాడికి టాలీవుడ్(Tollywood)లో పెద్దగా గుర్తింపు దక్కలేదు.ప్రముఖ బాలీవుడ్ నటి సంజీదా షేక్ (Sanjeeda Shaikh) తో హర్షవర్ధన్ డేటింగ్ లో ఉన్నాడు అంటూ గత కొంత కాలంగా బి-టౌన్ లో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ నటుడు అమీర్ అలీ(Aamir Ali)ని వివాహం చేసుకున్న సంజీదా షేక్.. 2021లో విడాకులు తీసుకోని విడిపోయింది. అమీర్ అలీతో ఒక పాపకి కూడా జన్మనించింది సంజీదా. హర్ష అండ్ సంజీదా కలిసి పలు సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని, ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.. కిమ్ శర్మ(Kim Sharma), మీనాక్షి దాస్ తో ప్రేమాయణం నడిపి విడిపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లయిన భామతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.