క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. దాంతో ఈయనకు బడా నిర్మాణ సంస్థల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నెక్ట్స్ యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. మళయళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా.. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ‘సీతా రామం’ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. అయినా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటిటిలో ఈ సినిమా చూసిన జనం.. మళ్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇప్పుడు అదే జోష్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా సీతారామం కాన్సెప్ట్‌తోనే తీసుకురాబోతున్నాడట. సీతారామం సినిమాలో ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి ప్రేమకథను చూపించిన హను.. మరోసారి ఇదే కాన్సెప్ట్‌తో సినిమా చేయబోతున్నాడట. కాకపోతే ఈ సారి యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. హిందూ, ముస్లిం స్నేహితుల మధ్యలో ఒక ఎమోషనల్ కథను తెరపైకి తీసుకురానున్నాడట. అందుకోసం నాని, శర్వానంద్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గతంలోనానితో ‘కృష్ణ గాడి వీర ప్రేమ కథ’.. శర్వానంద్‌తో ‘పడి పడి లేచే మనసు’ సినిమాలు చేశాడు హను. అయితే ఇలాంటి విషయాల్లో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.