Grandhalayam Movie విజయవాడలో ‘గ్రంథాలయం’ సినిమా బృందం సందడి
గ్రంథాలయం సినిమా టీజర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి చాలా చక్కటి విశేష స్పందన వస్తున్నది. దర్శకుడు సాయిశివన్ సస్పెన్స్, థ్రిల్లర్ దృశ్యాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారు.
సస్పెన్స్ థ్రిల్లర్ తో వస్తున్న ‘గ్రంథాలయం’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. దర్శకుడు సాయి శివన్ జంపన దర్శకత్వంలో విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి బోర హీరోహీరోయిన్లుగా నటించిన గ్రంథాలయం సినిమా (Grandhalayam Movie) టీజర్, ట్రైలర్ ఇటీవల విడుదలయి. మార్చి 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందం విజయవాడ (Vijayawada)లో సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్ (Promotions)లో భాగంగా విజయవాడలో చిత్ర బృందం పర్యటించింది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినిమా హీరో విన్ను మద్దిపాటి (Vinnu Maddipati) తెలిపారు.
చదవండి:Balagam Movie భావోద్వేగాల ‘బలగం‘.. ట్రైలర్ సూపర్బ్
విజయవాడ భారతి నగర్ లోని ఒక హోటల్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హీరో విన్ను మద్దిపాటి మాట్లాడుతూ.. ‘గ్రంథాలయం సినిమా టీజర్ కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి చాలా చక్కటి విశేష స్పందన వస్తున్నది. దర్శకుడు సాయిశివన్ సస్పెన్స్, థ్రిల్లర్ దృశ్యాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగా తీశారు. సినిమాకు టెక్నిషియన్స్, స్టాఫ్ అందరూ చాలా హార్ట్ వర్క్ చేశారు. ఈ సినిమాలో వచ్చే థ్రిల్లర్ సన్నివేశాలు చక్కటి థ్రిల్ అందిస్తాయని, కామెడీకి కూడా ప్రాధాన్యం ఉంది’ అని వివరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సాయి శివన్ జంపన (Sai Shivan Jampana) మాట్లాడుతూ.. ‘వైష్ణవి శ్రీ క్రియేషన్స్ (Vaishnavi Sri Creations) పతాకంపై నిర్మిస్తున్న గ్రంథాలయం చిత్రం మార్చి 3వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాం. ఈ సినిమా పూర్తిస్థాయి థ్రిల్లర్, సస్పెన్స్ (Thriller and Suspence) తో కూడుకున్నది. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా తీశాం. గ్రంథాలయంలో జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ఈ సినిమా కథ తనకు వచ్చిన కల అని, ఆ కల నేపథ్యంలోనే గ్రంథాలయం సినిమా తీశాం’ అని తెలిపాడు.
చదవండి: బడ్జెట్ పై మేల్కొన్న ఏపీ ప్రభుత్వం.. 14 నుంచి సమావేశాలు
అనంతరం హీరోయిన్ స్మిరిత రాణి మాట్లాడుతూ.. తెలుగులో తన మొదటి చిత్రం గ్రంథాలయం అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరింది. కార్యక్రమంలో నిర్మాత అయ్యప్ప అల్లంనేని, చిత్రబృంద సభ్యులు పాల్గొన్నారు. ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్, భద్రం, కాశీ విశ్వనాథ్, సోనియా చౌదరి, అలోక్ జైన్, జ్యోతి రానా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సామల భాస్కర్, సంగీతం వర్ధన్ అందిస్తుండగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిన్నా ఇవ్వగా.. ఎడిటింగ్ శేఖర్ పసుపులేటి.