నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రేపు రష్మిక పాత్రకు సంబంధించిన టీజర్ విడుదల కానుంది. అయితే రేపు ఉదయం 11.07లకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ దీన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.