ప్రస్తుతం స్టార్ బ్యూటీ సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ చెప్పి షాక్ ఇచ్చిన సామ్.. యశోద ప్రమోషన్లో భాగంగా కన్నీటి పర్యంతమైంది.
సమంత లీడ్ రోల్లో నటించిన ‘యశోద’ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో నవంబర్ 11న విడుదలవుతోంది. హెల్త్ సహకరించకపోయినా.. ‘యశోద’ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తునే.. ఓ ఇంటర్వ్యూ కూడా చేసింది సామ్. ఈ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయి తట్టుకోలేక ఏడ్చేసింది. ‘ఒక్కోసారి ఇంక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపిస్తుంది..
మరోసారి ఇన్ని దాటుకుంటూ వచ్చానా అనిపిస్తుందని’.. చెప్పింది సమంత. అలాగే తాను చనిపోతున్నానంటూ కొందరు రాసేశారని, అయితే తాను ఇంకా చనిపోలేదని, తాను ఫైట్ చేస్తున్నాని చెప్పింది. ప్రస్తుతం సమంత ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటికే సామ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఇప్పుడు సమంత ఎమోషనల్ వీడియో చూసి.. మరింత ఎమోషనల్ అవుతున్నారు. దాంతో నాగ చైతన్య దీనిపై స్పందిస్తాడా.. అని ఎదురు చూస్తున్నారు.
కానీ ఇప్పటివరకు చైతూ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ క్రమంలో.. ఇప్పటికైనా నాగ చైతన్య స్పందిస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు. కొందరైతే.. సమంత పరిస్థితికి తనే కారణం అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి సమంతలో ధైర్యం నింపేలా.. ఇప్పటికైనా చైతన్య ఏదో ఒకటి చేయాలని.. ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు. దాంతో ఫ్యాన్స్ కోరిక మేరకైనా చైతన్య.. సమంతకు సపోర్ట్‌గా నిలుస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది. మరి చైతన్య దీని పై స్పందిస్తాడేమో చూడాలి.