‘కన్నప్ప’ సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పుష్ప-2’ రిలీజ్ అవుతుందనే ‘కన్నప్ప’ సినిమా డిసెంబర్ నుంచి వాయిదా వేశారా? అనే ప్రశ్నపై విష్ణు స్పందించాడు. ‘ఈ రెండు చిత్రాల డిస్ట్రిబ్యూటర్స్ ఒక్కరే. ఆ విషయం మీకు త్వరలో తెలుస్తుంది. తెలుగులో కాదు దేశవ్యాప్తంగా మా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన వర్క్ జరుగుతోంది’ అని చెప్పుకొచ్చాడు.