»Emotional Post Of The Telugu Anchor Who Is Shedding Tears
Anchor Jhansi : కన్నీళ్లు పెట్టిస్తున్న తెలుగు యాంకర్ ఎమోషనల్ పోస్ట్
తన మేనేజర్ శ్రీను మృతిపై యాంకర్ ఝాన్సీ చేసిన ఎమోషనల్ పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. 'నాకు అతడే పెద్ద సపోర్ట్, హెయిర్ స్టయిలిష్ట్ నుంచి పర్సనల్ సెక్రటరీ గా మారాడు. నా పనులన్నీ సమర్థవంతంగా నిర్వహించేవాడు. జీవితం. నీటిబుడగలాంటిది' అని ఆమె పోస్ట్ చేశారు.
సినీ ఇండస్ట్రీ(Film industry)లో ఎక్కువ మంది మేనేజర్ల మీదే ఆధారపడతారు. ఏ సినిమా చేయాలన్నా.. ఎవరికి డేట్స్ ఇవ్వాలన్నా.. రెమ్యూనరేషన్ విషయంలోనైనా ఇలా అన్నింట్లోనూ మేనేజర్లే ఉంటారు. కొన్ని సార్లు మేనేజర్లే (Managers) మేజర్‌గా కనిపిస్తుంటారు. ఇండస్ట్రీలో మేనేజర్లు చేసే మోసాల గురించి అందరూ మాట్లాడుకుంటూనే ఉంటారు. మేనేజర్ వ్యవస్థ మీద చాలానే ఫిర్యాదులున్నాయి. కానీ అందరూ అలా ఉంటారని కాదు. తాజాగా తన మేనేజర్ మరణించారని యాంకర్ ఝాన్సీ (Anchor Jhansi) కన్నీరు పెట్టేసుకుంది. తొలితరం బుల్లితెర యాంకర్‌గా ప్రేక్షకులకు దగ్గరైన ఝాన్సీ ఆ తర్వాత సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం ఇటు బుల్లితెర, అటు సినిమాలకు కాస్తంత దూరంగా ఉన్న ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఓ విషాదకర పోస్టు పెట్టారు.
తన వద్ద పనిచేసే శ్రీను అనే వ్యక్తిగత సహాయకుడు (PA) 35 ఏళ్ల చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్‌తో మరణించాడని చెబుతూ విచారం వ్యక్తం చేశారు. శ్రీను, శ్రీనుబాబు (Srinubabu) అని తాను అతడిని ముద్దుగా పిలుచుకునేదానినని, అతడే తన మెయిన్ సపోర్ట్ సిస్టం అని తెలిపారు. తన వద్ద హెయిర్ స్టైలిస్ట్(Hair stylist)గా చేరి పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగాడని చెప్పారు. సున్నిత మనస్తత్వం కలిగిన శ్రీను తన స్టాఫ్ కంటే ఎక్కువని, తనకు తమ్ముడు లాంటివాడని పేర్కొన్నారు. అతడు తన బలమని, అతడే తన ఉపశమనమని తెలిపారు. గ్రాడ్యుయేట్ అయిన అతడు తన పనులను చక్కగా నిర్వర్తించేవాడని ప్రశంసించారు. తానిప్పుడు చాలా బాధలో ఉన్నానని, మాటలు కూడా రావడం లేదన్నారు. జీవితం (Life) ఒక బుడగలాంటిదని చెబుతూ ముగించారు. దీనితో ఝాన్సీ తీవ్ర భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేసింది. ఈ పోస్టు చూసిన వారు అతడి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.