హీరో రామ్చరణ్ నటించిన గేమ్ ఛేంజర్లో కోలీవుడ్ నటుడు SJ సూర్య కీలక పాత్ర పోషించారు. అయితే తమ సినిమా విడుదలవుతున్న సమయంలోనే అజిత్ నటిస్తోన్న ‘విదాముయార్చి’ రిలీజ్ కానుండటంపై తాజాగా ఆయన స్పందించారు. ‘వాళ్లు సడన్గా రిలీజ్ డేట్ చెప్పారు. అజిత్ సినిమాకు తమిళనాడులో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రేక్షకులు మా చిత్రాన్ని కూడా చూస్తారు. కాబట్టి దానిని పోటీగా చూడాల్సి అవసరం లేదు’ అని పేర్కొన్నారు.