దివంగత నటుడు ANR 101వ జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన ఆర్టిస్ట్ కళారత్న చింతలపల్లె కోటేష్ తనదైన శైలిలో నివాళులర్పించాడు. డ్రాయింగ్ చార్ట్‌పై ANR చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఆయన నటించిన సినిమాల పేర్లు, ఆయా మూవీల్లో ఆయన పోషించిన పాత్రల పేర్లతోనే ఈ బొమ్మను గీశాడు. ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటోంది.