ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒక్కో జానర్లో తెరకెక్కుతున్నాయి. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగతో కమిట్ అయిన ‘స్పిరిట్’ పోలీస్ స్టోరీగా రాబోతోందని టాక్. దాంతో ఈ సినిమాలు ప్రభాస్ స్టార్‌డమ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం పక్కా అంటున్నారు. ముఖ్యంగా ‘సలార్’ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. తమ దాహం తీర్చే సినిమా ఇదేనని అంటున్నారు.
అందుకే సలార్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే అఫీషియల్ అప్డేట్స్ కంటే.. సలార్‌కు లీకుల బెడద కాస్త ఎక్కువగా ఉంది. అందుకే ఇక నుంచి అలా జరగకుండా చిత్ర యూనిట్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాడట ప్రశాంత్ నీల్. సలార్ సెట్లో మొబైల్ ఫోన్లను బ్యాన్ చేసినట్టు టాక్. ఇదిలా ఉంటే సలార్ మూవీ వచ్చే ఏడాది.. అంటే 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. ఆ లెక్కన ఈ రోజుతో సలార్ థియేటర్ రాకకు.. కరెక్ట్‌గా ఇంకా సంవత్సరం టైం ఉంది. దాంతో రిలీజ్ డేట్ ప్రకటించడం వరకు ఓకే గానీ.. మరో ఎడాది కాలం ‘సలార్’ కోసం వెయిట్ చేయాలంటేనే.. ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఏదేమైనా సలార్ ఎప్పుడొచ్చినా.. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అంటున్నారు.