»Director Nag Ashwin Appealed To Elon Musk To Drive Kalki Buzzi
Kalki: బుజ్జిని నడపాలంటూ ఎలన్ మస్క్‌కు విజ్ఞప్తి చేసిన నాగ్ అశ్విన్
ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో ఆయన నడిపే వాహనం బుజ్జి గురించి నెట్టింట్లో జరుగుతున్న చర్చ తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలన్ మస్క్‌కు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
Director Nag Ashwin appealed to Elon Musk to drive Kalki Buzzi
Kalki: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రం కల్కి(Kalki) కోసం ఆయన అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యే సినిమా ప్రమోషన్లు సైతం మొదలు పెట్టారు. దానిలో భాగంగా బుజ్జిని పరిచయం చేశారు. బుజ్జి అంటే తెలుసు కదా.. కల్కిలో భైరవ నడిపే భారీ వాహనం. ఆ కారును ప్రేక్షకులకు పరిచయం చేయడానికి భారీ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కల్కి సినిమాకోసం మహేంద్ర కంపెనీ ఇంజనీర్లతో కలిసి ఈ బుజ్జిని తయారుచేశారు. అత్యంత క్రియేటీవ్‌గా ఉన్న ఈ వెహికల్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతుంది. అందే కాదు దేశంలోని పలు నగరాల్లో దీన్ని తిప్పుతూ ప్రమోషన్లు మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ తరువాత ప్రేక్షకులంతా డిస్కస్ చేస్తుంది బుజ్జి గురించే అంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. అంతలా దీనిపై నెట్టింట్లో చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ చేసిన ఓ పని ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని నెలకొల్పింది. టెస్లా ఓనర్ ప్రముఖ బిజినెస్మెన్ ఎలన్ మస్క్‌కు ఓ రిక్వెస్ట్ చేశాడు డైరెక్టర్. కల్కి క్రియేటర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రియమైన ఎలాన్ మస్క్ సర్.. మా బుజ్జిని ఒక సారి డ్రైవ్ చేయాలని మీకు మా ఆహ్వానాన్ని పంపిస్తున్నాము అని పోస్ట్ చేశారు. దీంతో ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్‌తో సంచలనం సృష్టిస్తున్న మస్క్ ఈ ట్వీట్‌కు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక బుజ్జి విషయానికి వస్తే 6 టన్నుల బరువున్న ఎలెక్ట్రిక్ వెహికల్. ఇది నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్పాలి.