Dil Raju: తీవ్ర ఒత్తిడిలో నిర్మాత దిల్ రాజు..కారణమిదే?
శంకర్, రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). శంకర్ సినిమాలను గమనిస్తే, అవి ఎప్పుడూ భారీ బడ్జెట్‌తో రూపొందినవే. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ కూడా భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
గేమ్ ఛేంజర్(Game Changer) మూవీ నిర్మిస్తున్న దిల్ రాజు మొదట్లో బడ్జెట్‌ను తిరిగి పొందడం కోసం ZEE స్టూడియోస్‌తో కలిసి పనిచేశాడు. జీ స్టూడియోస్ అన్ని భాషల నాన్-థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ హక్కుల కోసం దాదాపు రూ.250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే దిల్ రాజుకి కూడా కొంత మొత్తాలను అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ దిల్ రాజుకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇప్పుడు దిల్ రాజు(dil raju) తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
ZEE స్టూడియోస్ ఇచ్చిన మొత్తం, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన అడ్వాన్స్‌లతో, సినిమా బడ్జెట్‌ను సులభంగా నిర్వహించవచ్చని, లాభాలను పొందవచ్చని దిల్ రాజు భావించారు. కానీ 2023లో సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తే ఇప్పుడు 2023 సంవత్సరం పూర్తవుతున్న కూడా సినిమా పూర్తి కాలేదు. మరోవైపు ఇండియన్ 2(indian2), ఇండియన్ 3 సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నందున, గేమ్ ఛేంజర్ 2024లో విడుదలయ్యే అవకాశం లేదు. ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దిల్ రాజు కమిట్ అయిన తేదీల ప్రకారం ZEE స్టూడియోలకు అప్పగించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీ ఆలస్యం కావడం దిల్ రాజుకి కొత్త సమస్య వచ్చింది.
విడుదల తేదీ చాలా దూరంలో ఉన్నందున అతను పంపిణీ దారుల నుంచి ఎటువంటి అడ్వాన్స్‌లు పొందలేకపోయాడు. మరోవైపు తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి ఇవ్వాలని పలువురు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రీ షూట్లతో బడ్జెట్ పెరుగుతూనే ఉంది. శంకర్(shankar) ఎల్లప్పుడూ తన సినిమాల బడ్జెట్ల పరిమితులను మించిపోతాడని..ఈ చిత్రానికి సంబంధించి చాలా పనులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇక గేమ్ ఛేంజర్(Game Changer) మొదటి షెడ్యూల్ 2021లో మొదలైంది. ఇది రెండు సంవత్సరాల కంటే ఎక్కువ. దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఇక్కడి నుంచి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండాలి. అయితే విడుదల తేదీ ఆలస్యం అయినప్పుడు బడ్జెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఏ నిర్మాతకైనా ఇది కష్టమైన పరిస్థితేనని చెప్పాలి. మరి ఈ ప్రెజర్ ను దిల్ రాజు ఎలా మేనేజ్ చేస్తాడో లాభాలను ఎలా రాబట్టుకుంటాడో వేచి చూడాలి.