విశ్వక్ సేన్ అంటేనే కేరాఫ్ కాంట్రవర్శీ అనే టాక్ ఉంది. ఎందుకంటే సినిమాల కంటే.. వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలవడం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్టైల్. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కోసం నానా రచ్చ చేశాడు విశ్వక్. ఇక రీసెంట్గా యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు.
అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రిజల్ట్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న విశ్వక్.. ఇటీవలె ‘ఓరి దేవుడా’ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించాడు. ఇక ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో మరోసారి మెగా ఫోన్ పట్టాడు విశ్వక్. అందుకే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాడు.
ఇప్పటికే దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను.. దీపావళి రోజున రిలీజ్ చేయాలని భావించారు. కానీ కుదరలేదు.. దాంతో తాజాగా ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈసందర్భంగా No Alerts.. Only Dhamki అంటూ రాసుకొచ్చాడు విశ్వక్. ఇంతకు ముందు ప్రీ లుక్ పోస్టర్లో విశ్వక్ సేన్ బ్యాక్ సైడ్ లుక్‌ని చూపించగా..
ఇప్పుడు ఈ పోస్టర్లో పూర్తి లుక్ ని రివీల్ చేసారు. ఇందులో విశ్వక్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఈ పోస్టర్లో గోల్డ్ వాచ్‌ను హైలెట్ చేశారు. ఇక ఈ సినిమాని 2023 ఫిబ్రవరిలో తెలుగు, తమిళం, హిందీ మరియు మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్. మరి ఈ సినిమాతో విశ్వక్ పాన్ ఇండియా స్టార్డమ్ అందుకుంటాడేమో చూడాలి.