నెల రోజుల గ్యాప్‌లోనే రెండు మాసివ్ ప్రాజెక్ట్స్‌తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ముందుగా ‘ధమాకా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఆ తర్వాత 20 రోజులకు.. అంటే జనవరి 13న, మెగాస్టార్‌తో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో మాసివ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ధమాకా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. దర్శకుడు త్రినాథ రావు నక్కిన, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వరుస ఇంటర్య్వూలతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మాస్ సాంగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దండకడియాల్ అనే లిరికల్ సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ధమాకా మూవీ రన్ టైం చాలా తక్కువని తెలుస్తోంది. కేవలం 2గంటల 10నిమిషాల్లోపే ఈ సినిమా రన్‌టైం లాక్ చేశారట. ఈ మధ్య వస్తున్న పెద్ద సినిమాలు దాదాపుగా రెండున్నర గంటలకు పైగా నిడివితో వస్తున్నాయి. సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. అక్కడక్కడ బోర్ ఫీలవుతున్నారు. దాంతో క్రిస్పీ రన్ టైంతో వస్తే మరింత ప్లస్ కానుందని చెప్పొచ్చు. అందుకే ధమాకా తక్కువ రన్ టైంతో రానుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో.. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మరి ధమాకాతో మాస్ రాజా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.