యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. అయితే.. నెక్స్ట్ షెడ్యూల్‌తో దేవర పనైపోయినట్టేనని అంటున్నారు. మరి నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు?
Devara: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే.. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర దసరాకి పోస్ట్‌పోన్ అయింది. దీంతో నందమూరి అభిమానులు దేవర కోసం మరో ఆరు, ఏడు నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం గోవాలో దేవరకు సంబంధించిన కీలక షెడ్యూల్ షూట్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్‌తో పాటు విలన్ పై కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ షెడ్యూల్ తర్వాత క్లైమాక్స్ షూట్‌కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి.. అంటే ఏప్రిల్ మొదటి వారంలో దేవర క్లైమాక్స్ షూట్ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం. ఈ షూట్లో సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ పాల్గొనబోతున్నారట. దీంతో దేవర షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టేనని అంటున్నారు. అందుకే.. ఇమ్మిడియేట్‌గా ఎన్టీఆర్ ‘వార్ 2’కి డేట్స్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం టైగర్ 60 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడు. జూన్, జులై వరకు వార్ 2 కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఎన్టీఆర్‌తో సోలోగా 30 రోజులు, హృతిక్ రోషన్‌తో కలిసి 30 రోజులు షూట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే హృతిక్ రోషన్ ‘వార్ 2’ షూటింగ్లో జాయిన్ అయ్యాడు. దేవర షూటింగ్ కంప్లీట్ అవగానే.. ఎన్టీఆర్ కూడా వార్ 2 సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక వార్ 2 తర్వాత దేవర రిజల్ట్‌ను బట్టి పార్ట్ 2 ఉంటుందా? లేదంటే, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌ను సెట్స్ పైకి వెళ్తుందా? అనే విషయంలో క్లారిటీ లేదు.