ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవర పై భారీ అంచనాలున్నాయి. దేవర లేటెస్ట్ షెడ్యూల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.
Devara: ఎన్టీఆర్ అంటేనే కేరాఫ్ మాస్ సినిమాలు. అలాంటి మ్యాన్ ఆఫ్ మాసెస్ నుంచి అసలు సిసలైన మాస్ బొమ్మగా దేవర రాబోతోంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఓ ఎత్తు.. దేవర ఒక ఎత్తు అనేలా అన్ని బౌండరీస్ బ్రేక్ చేసి దేవర సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. సముద్రం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్ర వీరుడు చేసే ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర తుఫాన్ రాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్‌తో వస్తున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి.
ఈ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేలా దేవర గ్లింప్స్ ఉండడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. దేవర గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్.. ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి.. ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే దేవర సినిమా 85 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌ని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేసినట్టుగా సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్ వేశారట. మరో రెండు వారాల పాటు అక్కడే దేవర షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.
ఇక షూటింగ్ అయిపోయిన వెంటనే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ పెట్టనున్నాడు కొరటాల. ఎట్టి పరిస్థితుల్లోను ఏప్రిల్‌లో దేవర పార్ట్ 1 రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. నందమూరి ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా దేవరను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. మరి దేవర పార్ట్ 1 ఎలా ఉంటుందో చూడాలి.