ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఓ క్రేజీ కాంబినేషన్ ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇప్పటికే ప్రభాస్ నాలుగు సినిమాలు కమిట్ అయ్యాడు. వాటిలో ఓం రౌత్ ‘ఆదిపురుష్’, ప్రశాంత్ నీల్ ‘సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు సెట్స్ పై ఉండగా.. నెక్ట్స్ సందీప్ రెడ్డ వంగా ‘స్పిరిట్’ లైన్లో ఉంది. ఇవన్నీ థియేటర్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.
కానీ మరోవైపు డార్లింగ్ కొత్త ప్రాజెక్ట్స్ కమిట్ అవుతునే ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఇక మారుతితో ఏకంగా షూటింగ్ కూడా మొదలు పెట్టిసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అలాగే రాజ్ కుమార్ హిరాణీ లాంటి బడా బడా డైరెక్టర్స్ సైతం ప్రభాస్ కోసం కథలు రెడీ చేస్తున్నట్టు వార్తలు వస్తునే ఉన్నాయి.
అయితే ఇప్పుడు మరో మాస్ డైరెక్టర్ కూడా ప్రభాస్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే చర్చ జరుగుతోంది. అసలు ఈ కాంబో ఇప్పట్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువ. కానీ ఈ క్రేజీ బజ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో దుమ్ములేపిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. గతంలో ప్రభాస్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే టాక్ నడిచింది.
ఇప్పుడు మరోసారి ఈ కాంబో తెరపైకి వచ్చింది. అయితే ప్రభాస్ లాగే లోకేష్ కూడా విజయ్ 67ప్రాజెక్ట్‌తో పాటు.. ఖైదీ2, విక్రమ్2 కమిట్ అయ్యాడు. అలాగే రామ్ చరణ్‌తో కూడా లైన్లో ఉన్నాడు. కాబట్టి ఇప్పట్లో ప్రభాస్-లోకేష్ కాంబో కష్టమే. కానీ నిజంగానే ఈ మాసివ్ కాంబో సెట్ అయితే మాత్రం.. థియేటర్లో మాస్ జాతరేనని చెప్పొచ్చు.